Kiran Abbavaram | ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ క (KA). సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా వస్తోంది. అక్టోబర్ 31న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కిరణ్ అబ్బవరం టీం.
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం ఆసక్తికర విషయమొకటి అందరితో షేర్ చేసుకున్నాడు. ముందుగా ఈ చిత్రానికి ఇచ్చోటనే టైటిల్ అనుకున్నామని.. ఆ తర్వాత టైటిల్‌ను క గా మార్చామన్నాడు. ఇలా టైటిల్‌ను మార్చడానికి గల కారణం ఏంటనేది సినిమా ఎండింగ్లో చూపించబోతున్నామన్నాడు. తాజా కామెంట్‌తో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. టైం ట్రావెల్ కథాంశం చుట్టూ తిరిగే క చిత్రం నుంచి విడుదలైన రషెస్కు మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రంలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ మూవీకి శ్యా్మ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో సూపర్ బజ్ క్రియేట్ అవుతోంది.
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
VD 12 | ఫ్యాన్స్ మీట్లో విజయ్ దేవరకొండ.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడంటే..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Salaar | మరోసారి సలార్ హిస్టరీ.. ప్రభాస్ మేనియాకు మూవీ లవర్స్ ఫిదా