Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో కీలక పరిణామం వెలుగుచూసింది. బెంగళూరు పోలీసులు మొదట ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా హేమ (Hema)తోపాటు మరో 86 మందికి నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్యం కారణంగా హేమ మే 27న విచారణకు హాజరు కాలేదు. దీంతో రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ హేమ విచారణకు వెళ్లలేదు. మూడోసారి నోటీసులు జారీ చేయగా.. తాజాగా విచారణకు హాజరైన నేపథ్యంలో బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు హేమను అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
గత నెల 20న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఆ తర్వాత టెస్టుల్లో హేమతోపాటు మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. హేమ మొదట బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనప్పటికీ.. తాను వెళ్లలేదంటూ పలు వీడియోలు కూడా విడుదల చేసిందని తెలిసిందే. అయితే పోలీసులు విడుదల చేసిన హేమ ఫొటోలోని డ్రెస్, హేమ విడుదల చేసిన వీడియోల్లోని డ్రెస్ ఒకే విధంగా ఉండటంతో ఆమె పార్టీకి వెళ్లినట్టు నిర్దారణకు వచ్చారు పోలీసులు.
“Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. హేమకు మరోసారి నోటీసులు”
“Actress Hema | రేవ్ పార్టీ కేసులో విచారణకు హేమ డుమ్మా.. వైరల్ ఫీవర్ అంటూ లేఖ”
“Actress hema | బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు నోటీసులు”