Rithu Chowdary | ఇప్పుడు రేవ్ పార్టీల గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో సినీ నటి హేమ, ఆషీరాయ్ దొరకడం సంచలనం సృష్టించింది. దీంతో ఈ రేవ్ పార్టీల గురించి పలువురు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్లోనూ దీనిపై చర్చ నడిచింది. ఈ సందర్భంగా జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కూడా రేవ్ పార్టీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. వాటి గురించి తెలియక రేవ్ పార్టీలకు తనను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశానని బయటపెట్టింది.
రేవ్ పార్టీ అంటే ఏంటో ముందుగా నాకు తెలియదు.. అదేంటో తెలియక రేవ్ పార్టీకి నాకెప్పుడు ఆహ్వానం వస్తుందా? నన్నెప్పుడు పిలుస్తారా అని ఆశగా ఎదురుచూశానని రీతూ చౌదరి తెలిపింది. కానీ రేవ్ పార్టీల గురించి తెలిసిన తర్వాత వద్దని అనుకున్నానని చెప్పింది. అయితే ఇప్పటికీ రేవ్ పార్టీలపై పూర్తి అవగాహన లేదని.. ఛానల్స్‌లో చూసి అంతో ఇంతో తెలుసుకున్నానని పేర్కొంది.
డ్రగ్స్, నిషేధిత పదార్థాలు తీసుకుంటారని తెలిశాక రేవ్ పార్టీలు అవసరం లేదని ఫిక్సయ్యానని రీతూ చౌదరి ఆ షోలో చెప్పింది. సినీ ఇండస్ట్రీలోని వాళ్లు డ్రగ్స్ తెలిసి తీసుకుంటున్నారో.. తెలియక తీసుకుంటున్నారో వాళ్లకే తెలియాలని పేర్కొంది.