బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ (Janhvi Kapoor) టైటిల్ రోల్లో నటిస్తోన్న తాజా ప్రాజెక్టు గుడ్ లక్ జెర్రీ (GoodLuck Jerry). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కొత్త అప్ డేట్ వస్తుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు, ఫాలోవర్లు. కామెడీ క్రైం సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ్ సేన్ గుప్తా (Sidharth Sengupta) డైరెక్ట్ చేస్తున్నాడు. దీపక్ డోబ్రియాల్, మిఠా వసిష్ఠ, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. కాగా నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ (GoodLuck Jerry look)ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది జాన్వీకపూర్.
ఈ లుక్‌లో జాన్వీ కొంచెం భయపడుతూనే..చేతిలో పిస్తోల్ పట్టుకొని భయపెడుతోంది. ఇక మరో పోస్టర్లో జాన్వీకపూర్ టిఫిన్ బాక్స్ ఉన్న టేబుల్ చాటున దాక్కొని కొంచెం భయానకంగా కనిపిస్తోంది. నేను కొత్త సాహసయాత్రలో ఉన్నాను, గుడ్ లక్ చెప్పను..అంటూ క్యాప్షన్ ఇచ్చింది జాన్వీ. గుడ్ లక్ జెర్రీ జులై 29 నుంచి Disney+Hotstar లో ప్రీమియర్ కానుంది. ఈ చిత్రాన్ని పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో షూట్ చేశారు.
దీంతోపాటు జాన్వీకపూర్ మాథుకుట్టి జావియర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మిలి చిత్రంలో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులో సన్నీ కౌశల్, మనోజ్ పహ్వా నటిస్తున్నారు. బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ తండ్రితో కలిసి చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. మరోవైపు రాజ్ కుమార్ రావుతో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో నటిస్తోంది.
Read Also : Pooja Hegde | కరణ్ జోహార్ టీంతో జాయిన్ అయిన పూజాహెగ్డే..వీడియో
Read Also : DJ Tillu Sequel | సీక్వెల్‌తో వచ్చేస్తున్న డీజే టిల్లు..ఆ ఫ్లేవర్ రిపీట్ అయ్యేనా..?
Read Also : Shahrukh Khan | రామోజీఫిలింసిటీలో షారుక్ ఖాన్..జోష్‌లో అభిమానులు
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్