ప్రేమమ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ (Alphonse Puthren). ఏడేళ్ల విరామం తర్వాత భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకులను పలుకరించేందుకు రెడీ అయ్యాడు ఈ డైరెక్టర్. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), నయనతార (Nayanthara) కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రం గోల్డ్ (Gold). మేకర్స్ ఇవాళ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేశారు. సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రూపొందించారు.
ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, లాలూ అలెక్స్, మల్లికా సుకుమారన్, షమ్మి తిలకన్, బాబు రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోల్డ్ చిత్రానికి రైటింగ్, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, యానిమేషన్, డైరెక్షన్ అల్ఫోన్స్ పుత్రెన్. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. రాజేశ్ మురుగేశన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గోల్డ్ త్వరలోనే గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
ప్రేమమ్ డైరెక్టర్ కలర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి..సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు. మరి ఈ సారి ఎలాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
#Gold Poster 😍 pic.twitter.com/VHW4bxiUgv
— Alphonse Puthren (@puthrenalphonse) June 6, 2022
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ ఈ సారి కొత్త ప్లాన్‌తో వస్తున్నాడా..?
Read Also : Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!