Anilravipudi-Balakrishna Movie | టాలీవుడ్లో రాజమౌళి తర్వాత ఇప్పటివరకు ఫ్లాప్ చూడని దర్శకుడు అనిల్ రావిపూడి. హస్యాస్పద చిత్రాలను తెరకెక్కించడంలో ఈయన దిట్ట. ఇప్పటి వరకు అనిల్ తెరకెక్కించిన సినిమాలన్ని సూపర్ హిట్లే. కామెడీ కథలకు కమర్షియల్ హంగులను జోడించి బ్లాక్ బస్టర్లు సాధించడం ఈయన ప్రత్యేకత. ప్రస్తుతం ఈయన తెరకెక్కించిన ఎఫ్3 సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. పోటీగా మేజర్, విక్రమ్ సినిమాలున్న ఎఫ్3 డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీని తర్వాత అనిల్ రావిపూడి, బాలకృష్ణతో సినిమా చేయనున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ మొదలు పెట్టనుంది. తాజాగా ఈ చిత్రం గురించి అనిల్ ఓ ఆకక్తికర విషయం వెల్లడించాడు. ఈ చిత్రం తన చిత్రాలకు భిన్నంగా పూర్తి యాక్షన్ సినిమాగా ఉండనుందని తెలిపాడు. ఈ మాటలతో నందమూరి అభిమాలను సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. ఈ చిత్రం ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో ఉండనుందట. ఇక ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీలా నటించనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో షూటింగ్ పూర్తి చేసి సమ్మర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.