Puri Jagannadh | పూరీ జగన్నాథ్ ఈ సారి కొత్త ప్లాన్‌తో వస్తున్నాడా..?
తన డైలాగ్స్, హీరోల క్యారెక్టరైజేషన్ విషయంలో ఎప్పటికపుడు కొత్తగా చూపిస్తూ..సినిమాకు హైప్ తెస్తుంటాడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). పూరీ ప్రజెంట్ చేసే హీరోలకు క్రేజ్ మామూలుగా ఉండదు.
టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) టాప్ ప్లేస్‌లో ఉంటాడని ప్రత్యేకించి చెప్పనసవరం లేదు. తన డైలాగ్స్, హీరోల క్యారెక్టరైజేషన్ విషయంలో ఎప్పటికపుడు కొత్తగా చూపిస్తూ..సినిమాకు హైప్ తెస్తుంటాడు. పూరీ ప్రజెంట్ చేసే హీరోలకు క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే కొంతమంది డైరెక్టర్లతో పోలిస్తే..సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంటేషన్ విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కొంత నెమ్మదిగా ఉంటాడని అంటుంటారు ట్రేడ్ పండితులు. కానీ రాజమౌళి, సుకుమార్ లాగా సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసేలా కొత్ల ప్లాన్ చేశాడన్న వార్తలు టాలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తున్నాయి.
విజయ్ దేవరకొండతో చేస్తున్న జేజీఎం (JGM) సినిమాలో కొత్త విజువల్ వండర్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గతంలో పూరీ కొన్ని సినిమాల్లో విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్ల సాయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించడం మాత్రం చేయలేదు. ఇపుడు జేజీఎం సినిమా క్వాలిటీ ఉత్తమంగా ఉండేందు కోసం విదేశాల నుంచి టాప్ టెక్నీషియన్లు, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్లు, యాక్షన్ కొరియోగ్రాఫర్లును తీసుకుంటున్నాడట.
ఆర్ఆర్ఆర్ (RRR)తో రాజమౌళి, పుష్ప (Pushpa) సినిమాతో సుకుమార్ ప్రేక్షకులను స్టన్నింగ్ ఫీల్ అందించినట్టుగానే.. పూరీ జగన్నాథ్ కూడా ఈ సారి ఎలా జేజీఎంను చూపించబోతున్నాడన్నది సస్పెన్స్ నెలకొంది. విదేశీ టాలెంట్‌తో ఏ రేంజ్లో సినిమాకు హైప్ తెస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- JGM
- puri jagannadh
- pushpa
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

