Virushka | స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma).. గణేష్ చతుర్థి (Ganesh Chaturthi ) వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంబైలోని తమ నివాసంలో మంగళవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుష్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త కోహ్లీతో కలిసి పూజలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా అనుష్క ఎల్లో, రెడ్ కాంబినేషన్ పట్టుచీర (Pattu Saree) ధరించి మెరిసిపోయారు. ఇప్పటి వరకూ ఎవరూ చూడని విధంగా ఎంతో అందంగా ముస్తాబయ్యారు. అచ్చం తెలుగుంటి అమ్మాయిలా అందరినీ ఆకట్టుకున్నారు.
పూజకు సంబంధించిన ఫొటోలను అనుష్క ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విరుష్క (Virushka) జంట ఫొటోలకు అభిమానులే కాదు స్టార్స్ కూడా ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ సమంత, బాలీవుడ్ నటులు కరిష్మా కపూర్ సహా పలువురు స్టార్స్ హార్ట్ ఎమోజీలను కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు.
Also Read..
Shaheen Afridi | భార్యను రెండోసారి పెళ్లాడిన పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది
Navdeep | హైకోర్టులో నవదీప్కు షాక్.. పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశం