Game Changer | రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2025 జనవరి 10న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు వరుణ్ తేజ్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా మట్కా. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా రిలీజవుతోంది.
ఈ నేపథ్యంలో మెగా అభిమానులకు అదిరిపోయే విజువల్ ఫీస్ట్ ఉండబోతుందట. ఇంతకీ అదేంటనుకుంటున్నారా..? రాంచరణ్, వరుణ్ తేజ్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తే ఎలా ఉంటుంది. అభిమానులకు పండగే అని చెప్పాలి. తాజా అప్డేట్ ప్రకారం ఇటీవలే విడుదల చేసిన గేమ్ ఛేంజర్ టీజర్ థియేటర్లలో మట్కాతోపాటు స్క్రీనింగ్ కాబోతుందని ఇన్సైడ్ టాక్.
అయితే మట్కాతో గేమ్ ఛేంజర్ కూడా చూసే అవకాశం కేవలం యూఎస్ఏలో మాత్రమే అందుబాటులో ఉండబోతుందని తెలుస్తోంది. మరి మేకర్స్ ఇండియాలో కూడా ఇలాంటి ప్లాన్ చేస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.
గేమ్ ఛేంజర్‌లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు.
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?