Gadar 2 | థియేటర్లో గదర్ 2 సినిమా చూస్తూ పాకిస్థాన్ జిందాబాద్ నినాదం.. వ్యక్తిని చితకబాదిన ప్రేక్షకులు.. వీడియో
Gadar 2 | బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol), అమీషా పటేల్ (Amisha Patel) ప్రధాన పాత్రలో వచ్చిన ‘గదర్-2’ (Gadar 2) చిత్రం చూస్తూ ఓ వ్యక్తి ‘పాకిస్థాన్ జిందాబాద్’ (Pakistan Zindabad) అంటూ నినదించాడు. దీంతో పక్కనే ఉన్న కొందరు ప్రేక్షకులు ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు.
Gadar 2 | బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol), అమీషా పటేల్ (Amisha Patel) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘గదర్-2’ (Gadar 2). ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమా చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ థియేటర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చిత్ర పదర్శన మధ్యలో ఓ వ్యక్తి ‘పాకిస్థాన్ జిందాబాద్’ (Pakistan Zindabad) అంటూ నినదించాడు. దీంతో పక్కనే ఉన్న కొందరు ప్రేక్షకులు ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
2011లో విడుదలై బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన ‘గదర్ : ఏక్ ప్రేమ్ కథ’ (Gadar Ek Prem Katha) సినిమాకి కొనసాగింపు చిత్రమే ‘గదర్ 2’. అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. 1971 నాటి భారత్-పాక్ యుద్ధ సమయంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 11) విడుదలై పాజిటీవ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే సుమారు రూ.173 కోట్లు వసూలు చేసింది. ఉత్కర్ష్ శర్మ, స్మృతీ కౌర్, మనీష్ వాద్వా, గౌరవ్ చోప్రా తదితరులు కీలక పాత్రలో నటించారు. అనిల్ శర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మిథున్, మోంటీ శర్మ సంగీతం అందించారు.
https://twitter.com/BigBoss6041/status/1691043378857639936?s=20
Also Read..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

