కోల్‌కతా, మే 18: పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్ ఉద్యోగిని ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ముగ్గురు రాజ్‌భవన్ ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు శనివారం పోలీస్ అధికారులు తెలిపారు. ఘటన జరిగిన మే రెండో తేదీన బాధితురాలు రాజ్‌భవన్ నుంచి బయటకు పోకుండా ఈ ముగ్గురు అధికారులు అడ్డుకున్నారని, దీనిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. కాగా, తనను గవర్నర్ లైంగికంగా వేధిస్తున్నట్టు బాధితురాలు చేసిన ఆరోపణలపై పోలీసులు ఒక కమిటీని వేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.