Suriya | భార్య, పిల్లలతో కలిసి తమిళనాడు (Tamil Nadu) నుంచి ముంబై (Mumbai)కి షిఫ్ట్ అయినట్లు వస్తున్న వార్తలపై కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య (Suriya) స్పందించారు. ఆదివారం ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్న ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ముంబైకి మకాం మార్చినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను చెన్నై (Chennai)లోనే నివాసం ఉంటున్నట్లు చెప్పారు. అయితే తన కుమార్తె దియా (Diya), కొడుకు దేవ్ (Dev) మాత్రం చదువుల కోసం ముంబైలో ఉన్నారని తెలిపారు. అందుకే తరచూ ముంబైకి వెళ్తుంటానని, వారితో టైం స్పెండ్ చేస్తున్నట్లు వివరించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూర్య పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’ (Kanguva) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం వెట్రిమారన్ దర్శకత్వంలో జల్లికట్టు నేపథ్య కథాంశంతో తెరకెక్కనున్న ‘వాడి వసల్’ (Vaadi Vaasal) చిత్రంలో నటించబోతున్నారు. వీటితో పాటు సూర్య తాజాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ‘విక్రమ్’ (Vikram) చిత్రంలో మాఫియా డాన్ రోలెక్స్ (Rolex)గా సూర్య అతిథి పాత్రకు మంచి గుర్తింపు లభించింది.ఈ పాత్ర ఆధారంగా ఓ పూర్తి స్థాయి సినిమాకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్న సూర్య ‘రోలెక్స్’ చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ “లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. రోలెక్స్ పాత్ర ఆధారంగా చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా లైనప్లో ఈ సినిమా కూడా ఉంది’ అని చెప్పుకొచ్చారు.
Also Read..
Rishabh Pant | అభిమానులకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన పంత్..!
Independence Day | అమెరికాలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
Burj Khalifa | బుర్జ్ ఖలీఫాపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. వీడియో