టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటిస్తున్న సినిమాల్లో ఒకటి క్రేజీ ఫెలో (Crazy Fellow). ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను (Crazy Fellow Teaser) మేకర్స్ లాంఛ్ చేశారు.
‘ఒక పంచ్ లైన్లో మనోడి గురించి చెప్పాలంటే..మందు తాగితే లివర్ పోద్ది, సిగరెట్ తాగితే లంగ్స్ పోతాయి..వీడితో ఉండే దూల తీరిపోతుంది..’అంటూ హీరో పాత్రను ఇంట్రడ్యూస్ చేసే సాయికుమార్ వాయిస్ ఓవర్ తో మొదలైంది టీజర్. పన్, లవ్, సీరియస్ ట్రాక్‌తో అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతుందని టీజర్ చెబుతోంది.
ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశి, మిర్నా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. సప్తగిరి, నర్రా శ్రీనివాస్, అనీష్ కురువిల్ల, వినోధిని వైద్యనాథన్, రవిప్రకాశ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రానికి ధ్రువన్ మ్యూజిక్ డైరెక్టర్. క్రేజీ ఫెలో అక్టోబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Also : Chiranjeevi | లో క్లాస్ టికెట్స్ లైన్లో నాగబాబుకు ఊపిరాడలేదు : చిరంజీవి
Read Also : 67th Filmfare Awards | ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్..ఉత్తమ నటిగా కృతిసనన్
Read Also : Irfan Pathan | మాజీ క్రికెటర్‌కు పవన్ కల్యాణ్ స్టైల్ అంటే ఇష్టమట..!
Read Also : Tollywood Ganesh idols | మార్కెట్లో టాలీవుడ్ స్పెషల్ గణేశుల సందడి