Puneeth rajkumar | పునీత్ రాజ్ కుమార్ అనేది కన్నడనాట పేరు కాదు.. ఒక ఎమోషన్.. ఒక బ్రాండ్.. యూత్ ఐకాన్.. ఇలా ఎన్ని పేర్లు అయినా పెట్టుకోవచ్చు. అంతటి ఇమేజ్ సంపాదించుకున్న నటుడు ఉన్నట్టుండి గుండెపోటుతో మరణిస్తే అభిమానులు ఎలా తట్టుకుంటారు..? వాళ్ల గుండెలు మాత్రం ఎలా ఆగిపోకుండా ఉంటాయి..? ఇప్పుడు ఇదే జరుగుతుంది. పునీత్ మరణించిన విషయం తెలుసుకుని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు.. మరికొందరు బలవన్మరణం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో నలుగురు అభిమానులు ఇలా ప్రాణాలు కోల్పోయారు.
అందరూ శాంతంగా ఉండండి.. ఎవరు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకండి అని ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో వాళ్లు లేరు. తమ రాజకుమార ఇక ఎప్పటికీ రాడని.. తమకు లేడు అనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేక తమ ప్రాణాలు వదిలేస్తున్నారు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణవార్త విన్న వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే రాయచూరు జిల్లాలో ఇద్దరు అభిమానులు బసవ గౌడ్, మహమ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. అందులో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చామరాజనగర్ జిల్లాలో మునియప్ప అనే అభిమాని టీవీ చూస్తూనే పునీత్ రాజ్‌కుమార్ చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. ఉడిపి జిల్లాలో సతీష్ అనే రిక్షా కార్మికుడు తన అభిమాన హీరో పునీత్ చిత్రపటానికి పూలమాల వేస్తూ అలాగే కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. మరో అభిమాని సైతం ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు.
పునీత్ అంటే అభిమానులకు దేవుడితో సమానం. కేవలం సినిమాలు మాత్రమే చూసి పెంచుకున్న అభిమానం కాదు ఇది. ఆయన చేసే సేవా కార్యక్రమాలకు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఏటా దాదాపు 20 నుంచి 30 కోట్లు సేవా కార్యక్రమాల కోసం ఆయన ఖర్చు పెడుతున్నాడనే విషయం తెలిసి అందరూ సలాం చేస్తున్నారు. అలాంటి మానవతావాది మరణం తట్టుకోలేక ఎందరో అభిమానుల గుండెలు ఆగిపోతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు