జాతిరత్నాలు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా. తొలి సినిమాతోనే అందరి మనసులు గెలుచుకున్న ఫరియా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ కి సంబంధించిన వీడియోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరం వర్షంలో తడిసి ముద్దవుతుండగా, రుతుపవనాల రాకతో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నానంటూ ఫరియా తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేసింది.
తన డ్యాన్స్ వీడియో క్లిప్ లలో ‘ఆజా రీ మోర్ సైయన్’ పాటకు కథక్ స్టైల్లో డ్యాన్స్ చేసి అలరించింది. మూడు వీడియో క్లిప్స్‌లో ఫరియా డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఫరియా రానున్న రోజులలో తన అద్భుతమైన టాలెంట్‌తో మంచి ఆఫర్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.