పటాన్చెరు టౌన్, ఆగస్టు 19 : ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి బుధవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలోకి రావాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన వారిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, ఇతర నాయకులు ఉన్నారు.