ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు సీనియర్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur).. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పారు. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల పగ్గాలను వదిలేసినట్లు ఆమె తెలిపారు. 2025లో ఇండియాకు వన్డే వరల్డ్‌కప్ అందిచిన హర్మన్‌ప్రీత్.. కెప్టెన్‌గా చేశారు. భారత జట్టుకు అతి సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది. కౌర్ తప్పుకోవడంతో ఇక వైస్ కెప్టెన్ స్మృతి మందానా లీడర్షిప్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న హర్మన్‌ప్రీత్ ఇక నుంచి ఎక్కువగా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. తాను తీసుకున్న నిర్ణయం సులువైంది కాదు అని, ఇది ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాల ఫలితం అని ఆమె అన్నారు.
ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ వయసు 37 ఏళ్లు. ఆమె అయిదు టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20లకు కెప్టెన్‌గా న్నారు. ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆమె తన కెప్టెన్సీ వీడ్కోల ప్రకటన చేసింది. తాజాగా ముగిసిన ఆసియా గేమ్స్‌లో.. హర్మన్ నేతృత్వంలోని భారత జట్టు గోల్డ్ మెడల్ కొట్టిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే గౌహతిలో బీసీసీ కార్యదర్శి దేవజిత్ సైకియాతో హర్మన్, స్మృతి, అమోల్ మజుందార్ కలిసిన విషయం తెలిసిందే. నాయకత్వ బాధ్యతలను త్యజించినా.. తన క్రికెట్ జర్నీ కొనసాగుతుందని, బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టనున్నట్లు ఆమె చెప్పారు.