టాలీవుడ్ ( Tollywood) హీరోలు వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న చిత్రం ఎఫ్3 (F3). తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఫన్ ఎంటర్ టైనర్ ఎఫ్ 2కు కొనసాగింపుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోంది ఎఫ్3. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను మేకర్స్ అందించారు. తాజా కామెడీ ఎంటర్ టైనర్ కొత్త షెడ్యూలు చిత్రీకరణ ఇవాళ హైదరాబాద్ లోమొదలైంది. ప్రధాన తారాగణంతోపాటు సునీల్, అన్నపూర్ణమ్మ, ఇతర నటీనటులంతా చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు.
తాజా అప్ డేట్ ను తెలియజేస్తూ లొకేషన్ మేకింగ్ వీడియో (F3 making video) ను నిర్మాతలు విడుదల చేశారు. ఎఫ్ 3 ఫన్ డోస్ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోతో మూడు రెట్ల వినోదం ఖాయమని అర్థమవుతుంది. వెంకీ, వరుణ్, తమన్నా, మెహరీన్ తోపాటు ఇతర యాక్టర్లంతా తమ నటనతో ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని అందించేందుకు సిద్దమవుతున్నట్టు తాజా వీడియో చెప్తోంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు.
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా వ్యవహరిస్తున్నారు. మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయబోతున్నాడు రాక్ స్టార్ డీఎస్పీ. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది ఎఫ్ 3. 2018లో సంక్రాంతికి విడుదలై ఎఫ్ 2 బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సారి ఎఫ్ 3 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా..సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా పెరిగిపోయాయి.
Love Story | లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోలు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్