Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శివ (Siva) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలవుతుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లో సందడి చేసింది సూర్య టీం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ.. కంగువలో వెట్రి పలనిస్వామి చిత్రీకరించిన విజువల్స్ చూసి దేశంలో ఉన్న ప్రతీ ఫిల్మ్ మేకర్ ఆశ్చర్యపోవడమే కాదు.. షాకవుతారు. కరణ్ జోహార్ 45 నిమిషాల పుటేజీ చూశారు. కంగువ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ప్రేక్షకులంతా కంగువ విజువల్స్ చూసిన తర్వాత నమ్మశక్యంగా అనిపించకపోవడమే కాదు.. అందరూ షాకవుతారంటూ చెప్పుకొచ్చాడు సూర్య.
ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న కంగువ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కంగువ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుంది.
Pushpa 2 Vs Chaava | పుష్పరాజ్ ఫీవర్.. అల్లు అర్జున్‌తో పోటీపై విక్కీ కౌశల్ వెనక్కి తగ్గాడా..?
Prithviraj Sukumaran | కరీనాకపూర్‌తో పృథ్విరాజ్ సుకుమారన్ రొమాన్స్..!
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్