Lucky Baskhar | ఇటీవలే ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). బ్యాంకింగ్ సెక్టార్లో జరిగే స్కాం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటించింది. అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ ఇక ఓటీటీలో సందడి చేయనుంది.
పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 28న ప్రీమియర్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా తెలుగుతోపాటు ఆయా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకేంటి మరి థియేటర్లో మిస్సయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ డే నుంచి రికార్డు వసూళ్లతో నాలుగో వారం తర్వాత కూడా సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. రూ.100 కోట్లకు వసూళ్లతో దూసుకెళ్తోన్న లక్కీ భాస్కర్ మరి ఓటీటీలో ఎలాంటి ఇంప్రెషన్ కొట్టాస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
నా పేరు భాస్కర్ కుమార్.. నా జీతం ఆరు వేల రూపాయలు. బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. నా బలం నా భార్య.. అసలు కథ ఇప్పుడే మొదలైందంటూ.. కాలి గోటి నుంచి తల వరకు ఏది కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించానంటూ.. అంటూ సాగే డైలాగ్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెరకెక్కించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
Experience the magic of #BlockbusterLuckyBaskhar to your home screens! 🤩
Watch #LuckyBaskhar on @netflix from 28 November in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi Languages! 💰💵#LuckyBaskharOnNetflix @dulQuer #VenkyAtluri @gvprakash @Meenakshiioffl @vamsi84… pic.twitter.com/S87VWKMTBE
— BA Raju’s Team (@baraju_SuperHit) November 25, 2024
Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్