Lucky Baskhar | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటించిన ఈ మూవీ నేడు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలైంది. లక్కీ భాస్కర్ థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన చాలా సెంటర్లలో పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
కాగా ఇప్పుడు లక్కీ భాస్కర్ డిజిటల్ ప్లాట్‌ఫాం అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. లక్కీ భాస్కర్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుందని ఇన్సైడ్ టాక్. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది.
నా పేరు భాస్కర్ కుమార్.. నా జీతం ఆరు వేల రూపాయలు. బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. నా బలం నా భార్య.. అంటూ దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్‌తో సాగుతున్న డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్. అసలు కథ ఇప్పుడే మొదలైందంటూ.. కాలి గోటి నుంచి తల వరకు ఏది కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించానంటూ దుల్కర్ సల్మాన్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెరకెక్కించగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
KA | కిరణ్ అబ్బవరం క చిత్రానికి సూపర్ క్రేజ్.. ఓటీటీ, శాటిలైట్స్ ఎంత పలికాయో తెలుసా..?
Lucky Baskhar Twitter Review | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్‌గా ఇంప్రెస్ చేశాడా..?
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే