Double iSmart | పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.
అయితే ఎవరూ ఊహించని విధంగా లైగర్ తర్వాత మరో ఫెయిల్యూర్‌గా పూరీ ఖాతాలో పడిపోయింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోని ఈ చిత్రం ఇక టెలివిజన్ ప్రేక్షకుల దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఈ యాక్షన్ డ్రామా అక్టోబర్ 27న (ఆదివారం) జీ తెలుగు సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ కానుంది.
మరి టీవీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాల్సి ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటించగా.. షాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటించారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కించింది.
World Television Premiere#DoubleIsmart coming soon on #ZeeTelugu #DoubleIsmartOnZeeTelugu#RamPothineni #KavyaThapar #PuriJagannadh pic.twitter.com/jyZAASzORg
— Television & Tollywood Updates (@TTUpdates360) October 19, 2024
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
VD 12 | ఫ్యాన్స్ మీట్లో విజయ్ దేవరకొండ.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడంటే..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Salaar | మరోసారి సలార్ హిస్టరీ.. ప్రభాస్ మేనియాకు మూవీ లవర్స్ ఫిదా