Dolby Vision theater | వినోద రంగంలో ఎప్పటికపుడు కొత్త కొత్త టెక్నాలజీ తెరపైకి వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఇప్పటికే పలు రకాల వెర్షన్ల థియేటర్లు వరల్డ్ వైడ్‌గా పలు దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్ల విషయంలో అప్డేట్గా ఉండే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటుందని తెలిసిందే.
ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ ఎక్స్పీరియన్స్ డాల్బీ విజన్ ఫార్మాట్. ఈ అనుభూతిని అందించేందుకు త్వరలోనే ఇండియాలో కూడా డాల్బీ విజన్ థియేటర్ (Dolby Vision theater) అందుబాటులోకి రానుందన్న వార్త ఒకటి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. పాపులర్ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్‌లోని నార్సింగి Dolby Vision equipped cinema సౌకర్యాన్ని కల్పించబోతున్నారు.
ఈ విషయాన్ని పుష్ప నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ స్పష్టం చేశారు. డాల్బీ విజన్ థియేటర్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనేదానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారట. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ సినిమా డాల్బీ విజన్ ఫార్మాట్లో కూడా సందడి చేయనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సందడిచేయనుంది. ఈ నేపథ్యంలో మరి అల్లు అరవింద్ పుష్ప సినిమాను దృష్టిలో పెట్టుకొని ముందే డాల్బీ థియేటర్ ప్లాన్ చేసుకున్నారా..? డాల్బీ థియేటర్‌ను పుష్ప విడుదలకు ముందే అందుబాటులోకి తెస్తాడా..? అనేది చూడాలి.
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి