Disha Patani | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోయిన్లలో ఒకరు దిశాపటానీ (Disha Patani). ఇటీవలే కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా దిశాపటానీ తండ్రి జగదీష్ పటానీ వార్తల్లో నిలిచాడు. ఈయన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిసిందే.
తనకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయి క్యాడర్ వచ్చేలా చేస్తామని చెప్పి సహచర ఉద్యోగులతోపాటు మరికొందరు రూ.25 లక్షలు దోపిడీ చేశారని జగదీష్ పటానీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు రూ.5 లక్షలు నగదు, మిగిలిన రూ.20 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయాలని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
హై క్యాడర్ ర్యాంకింగ్ పొజిషన్ రాకపోవడంతో అనుమానం వచ్చి.. ఆరా తీయగా మోసపోయినట్టు తెలుసుకుని కేసు ఫైల్ చేశాడు జగదీష్ పటానీ. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు పలువురిని ఆరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Diljit Dosanjh | వాళ్లు ఏం చేసినా అనుమతిస్తారు.. వివాదంపై దిల్జీజ్ దోసాంజ్
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్