ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్.. సర్కారు వారి పాట డైరెక్టర్ భారీ స్కెచ్

Director Parasuaram | తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి ఇద్దరు సూపర్ స్టార్స్‌ను కలిపి ట్రిపుల్ ఆర్ సినిమా చేసిన తర్వాత మన హీరోలు పూర్తిగా మారిపోయారు. కథ బాగుంటే కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెబుతున్నారు. దీంతో దర్శకులు కూడా మంచి కథలతో హీరోల ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మరో క్రేజీ మల్టీస్టారర్ గురించి టాలీవుడ్లో చర్చ మొదలైంది.
ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడు పరశురామ్.. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు. తన దగ్గర ఒక అద్భుతమైన మల్టీస్టారర్ కథ ఉందని.. అందులో ముగ్గురు హీరోలు అవసరం పడతారని చెప్పాడు. సర్కారు వారి పాట సినిమా హిట్టయితే కచ్చితంగా ఆ సినిమా పట్టాలు ఎక్కడం ఖాయం. ఎందుకంటే మహేశ్ సినిమా విజయం సాధిస్తే ఈజీగా 100 కోట్లు వసూలు చేస్తుంది. ఆ నమ్మకంతో ఏ నిర్మాత అయినా కూడా పరశురామ్ చెప్పే కథను తెరకెక్కించేందుకు ముందుకొస్తారు. ఆ ముగ్గురు హీరోల మల్టీస్టారర్ కచ్చితంగా సెట్స్ పైకి వస్తుంది. అయితే ఆ హీరోలు ఎవరూ, కథ ఎలా ఉండబోతోందనే విషయం మాత్రం ఈయన ఓపెన్ చేయలేదు. కానీ ఒకటి మాత్రం నిజం ముగ్గురు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే అంతకంటే సంచలనం మరొకటి ఉండదు. యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరుశురాం.. ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్లో మొదటిసారి మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పైనే పరశురాం కెరీర్ ఆధారపడి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Ramesh babu | మొదటి సినిమాకే బాలయ్యతో వివాదం.. టైటిల్ కోసం యుద్ధమే జరిగింది !
Anupama | లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్..
Bangarraju | బంగార్రాజు సినిమాలో 8 మంది హీరోయిన్లు.. ఎవరెవరంటే..
Mahesh | మరో జన్మంటూ ఉంటే.. అప్పుడూ నువ్వే నా అన్నయ్య: సోదరుడి మృతిపై మహేశ్ ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

