స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ సార్ (Sir). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుండగా.. తమిళంలో వాథి (Vaathi) అనే టైటిల్‌తో వస్తోంది. సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
వాథి తమిళనాడు థ్రియాట్రికల్ రైట్స్ ను సెవెన్ స్క్రీన్ స్టూడియో దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ వీడియోను షేర్ చేశారు. సార్ చిత్రాన్ని 2023 ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్-ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి-సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో సాయికుమార్ విలన్‌గా నటిస్తుండగా.. తనికెళ్లభరణి కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనుష్‌కు ఇది తెలుగులో తొలి స్ట్రెయిట్ సినిమా కావడం విశేషం. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మాస్టారు మాస్టారు సాంగ్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
వాథి అప్డేట్.. వీడియో
We are super excited to announce our collaboration with @7screenstudio for the Tamil Nadu theatrical rights of #Vaathi 🙌🏽 #SirMovie @dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas #SrikaraStudios @adityamusic pic.twitter.com/P1EyEDAOtj
— Sithara Entertainments (@SitharaEnts) December 23, 2022
మాస్టారు.. మాస్టారు తెలుగు వెర్షన్..
వావాథి తమిళ వెర్షన్..
Read Also : Trivikram Srinivas | తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్పది: త్రివిక్రమ్ శ్రీనివాస్
Read Also :Butterfly | అనుపమ పరమేశ్వరన్ బట్టర్ ఫ్లై నుంచి అమ్మ వీడియో సాంగ్
Read Also : Hombale Films | హోంబలే ఫిలిమ్స్ టార్గెట్ ఫిక్స్.. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్కు భారీ ప్లాన్