Trivikram Srinivas | తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్పది: త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ (kaikala Satyanarayana) పార్థీవ దేహానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) నివాళులర్పించారు. అనంతరం త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను మొట్టమొదట హైదరాబాద్కు వచ్చినపుడు సత్యనారాయణ గారి దగ్గరికెళ్లి కథ చెప్పాను.
ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ (kaikala Satyanarayana) పార్థీవ దేహానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) నివాళులర్పించారు. అనంతరం త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను మొట్టమొదట హైదరాబాద్కు వచ్చినపుడు సత్యనారాయణ గారి దగ్గరికెళ్లి కథ చెప్పాను. నేను డైరెక్టుగా రచయితగా ఆయన సినిమాలకు పనిచేయలేదు. కానీ సహరచయితగా ఆయన సినిమాలకు చాలా వరకు పనిచేశాను. ఒక ప్రేక్షకుడిగా మనందరికీ ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో ఒక తరం ముగిసిపోయినట్టుగా నాకనిపిస్తోందన్నారు త్రివిక్రమ్.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప నటుడు కైకాల. ఆయన బతకడం ఒక పండగే. ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు. కైకాల మీద ఏ రకమైన ఫిర్యాదులు లేవు. ఆయన లేని లోటు మనందరికీ ఎప్పటికీ పూడ్చలేనిది. కైకాల కుటుంబసభ్యులకు తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు ప్రేక్షకుల తరపున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
అధికారిక లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్పది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

