– సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం
సూర్యాపేట, జనవరి 09 : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని, పోటీతత్వంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని నాగారం సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుంటకండ్ల సావిత్రమ్మ జ్ఞాపకార్థం విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతంలో డిబేట్ పీరియడ్ ఉండేదని, డిబేట్ పీరియడ్ పెడితే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనానని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటకండ్ల వేమన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు వీడీఎస్ ప్రసాద్, వాసు, గురువయ్య, సైదులు, బషీర్, ఉన్నిసా, వెంకట కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.

Suryapet : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలి : సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రారెడ్డి