Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్లడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు సెటైర్లు వేశారు. సినిమా థియేటర్ ఓపెనింగ్‌కు వెళ్తున్న రేవంత్ రెడ్డికి.. అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా అని సవాలు విసిరారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని ముఖం చూడలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి సినిమా థియేటర్‌కు వెళ్లే సమయం ఉంది కానీ.. నిరుద్యోగులను కలిసే సమయం లేదని మండిపడ్డారు.
జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్ చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వనే లేదని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యమంటున్నాడని తెలిపారు. ఎన్నికల్లో నిరుద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని అన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో భాగంగా నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో నూనె ఉత్పత్తిని ప్రారంభించిందని అన్నారు. కేసీఆర్ కలలు నిజమయ్యాయని సంతోషంగా ఉందని తెలిపారు. రైతబంధుతో రైతులకు కొండంత అండగా నిలిచిన ఘనత కేసీఆర్‌దే అని కొనియాడారు. రైతులకు నీళ్లు, కరెంటు, ఎరువు బాధలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. కేసీఆర్ పాలనలో యూరియా కష్టాలు అసలే లేవని అన్నారు. రైతుల గౌరవాన్ని కేసీఆర్ పెంచారని తెలిపారు. అదే రెండేళ్ల రేవంత్ పాలనలో వ్యవసాయం అస్తవ్యస్తమైందని మండిపడ్డారు.
ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. యూరియా కోసం అరిగోస పడుతున్నారని పేర్కొన్నారు. షాపుల్లో లేని యూరియా యాప్‌లలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. యూరియా బస్తాల్లో కూడా కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. ఒక్క బస్తా యూరియా కోసం ఎన్నిసార్లు షాపుల చుట్టూ తిరగాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రైతుబంధు రెండుసార్లు ఎగ్గొట్టిండని తెలిపారు. రైతుబీమా కూడా కట్టడం లేదని విమర్శించారు. బోనస్ కూడా బోగస్ చేసేశాడని అన్నారు. రైతులకు చేసిన మేలు ఏంటో చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో రూ.30-40 కోట్లు కాల్వలకు ఖర్చు చేస్తే నాలుగైదు లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పగబట్టాడని విమర్శించారు. రేవంత్ సర్కార్‌కు కనీసం కాల్వలు తవ్వే తెలివి కూడా లేదా అని మండిపడ్డారు.
సినిమా థియేటర్ ఓపెనింగ్ వెళ్తున్న రేవంత్ రెడ్డికి..
అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే దమ్ముందా ?
నాడు ఎన్నికల సమయంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు.. ఇప్పుడెందుకు ముఖం చూపడం లేదు.
వేలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య సినిమా థియేటర్ వెళ్ళే సమయం ఉన్న నీకు..… pic.twitter.com/xAyXyY2Xt2
— Office of Harish Rao (@HarishRaoOffice) January 9, 2026