తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన తిరు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) . టాలెంటెడ్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం ‘నానె వరువెన్’. తెలుగులో నేనే వస్తున్నా (Nene Vasthunna) టైటిల్‌తో విడుదల కానుంది. మేకర్స్ తాజాగా టీజర్ (Nene Vasthunna teaser) విడుదల చేశారు.
ధనుష్ ఓవైపు ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేసే వ్యక్తిగా..మరోవైపు విల్లు ఎక్కుపెట్టి కొంతమందిని వేటాడుతున్న వ్యక్తిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. ధనుష్ హీరో కమ్ విలన్‌గా కనిపించబోతున్నాడని టీజర్‌తో హింట్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. టీజర్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది.
సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో థ్రిల్ అందించడం ఖాయమని టీజర్‌తో అర్థమవుతుంది. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ విడుదల చేస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎల్లి ఎవ్రామ్, ఇంధూజ రవిచంద్రన్, ప్రభు, సెల్వ రాఘవన్, యోగిబాబు కీ రోల్స్ చేస్తున్నారు.
Read Also : Telugu Film Chamber | తెలుగు ‘ఫిల్మ్ ఛాంబర్-ఫిల్మ్ ఫెడరేషన్’ చర్చలు సఫలం..వివరాలివే..!
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!
Read Also :God Father | ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్ సింగిల్ టైం ఫిక్స్.. రిలీజ్ ఎన్నిటికంటే?
Read Also : Vikram Vedha | బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్.. ‘విక్రమ్ వేధ’ ఎన్ని దేశాల్లో రిలీజవుతుందో తెలుసా..?