హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 30 : ఇండియన్ నేషనలిస్టు మూవ్మెంట్(ఇనామ్) ఆధ్వర్యంలో అక్టోబర్ 3న సాయంత్రం 6 గంటలకు హనుమకొండ రాయపురలోని జక్రియా ఫంక్షన్ హాల్లో ‘భారత ఎన్నికల ప్రక్రియ, మైనార్టీల స్థితిగతులు’ అనే అంశంపై దివంగత మోటూరి కృష్ణప్రసాద్ సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు ఇనామ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మమహ్మద్ అబ్దుల్ అలీ జుబేర్ తెలిపారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
2018లో విద్యావేత్తలు, వృత్తినిపుణులు, సామాజిక కార్యకర్తలు, న్యావాదులు, విద్యార్థులు, మైనార్టీలు, దళితులు, కైస్తవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలకు చెందిన ప్రజలు కలిసి ఇనామ్ స్థాపించినట్లు గుర్తుచేశారు. ఈ సమావేశంలో డాక్టర్ రాజ్‌మహ్మద్, నున్న అప్పారావు, ఎస్.ఓంబ్రహ్మం, ఖాజాఅస్లాం, మహ్మద్ సిరాజ్, మహ్మద్ పర్వేజ్, అబ్దుల్ సుభాన్, ఐసాన్ మహ్మద్బాబర్, ఎస్.రాంబ్రహ్మం, ఎంఏ సుల్తాన్ పాల్గొన్నారు.