Asian Games : ఆసియా క్రీడల్లో బుధవారం భారత బృందం పతకాల వేటతో పోడియంపై సందడి చేస్తోంది. ఆర్చరీలో ఏకంగా మూడు స్వర్ణాలు రాగా.. రెజ్లింగ్‌లో సునీల్ కుమార్ (Sunil Kumar) కాంస్యం సాధించాడు. గ్రీకో రోమన్ పురుషుల 87 కిలోల విభాగంలో ఉడుంపట్టుతో పతకం పట్టేశాడు సునీల్. కల్లమ్ రాబర్ట్స్ జాన్స్టన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన భారత రెజ్లర్ 5-0తో జయకేతనం ఎగురవేశాడు. గత ఎడిషన్‌లోనూ సునీల్ కంచుమోత మోగించిన విషయం తెలిసిందే.
ఐచీ నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో రెజ్లర్ సునీల్ కుమార్ పతకంతో మెరిశాడు. గ్రీకో రోమన్ పురుషుల 87 కిలోల విభాగంలో సత్తా చాటిన సునీల్ కాంస్యం కొల్లగొట్టాడు. తొలి రౌండ్లోనే కల్లమ్ రాబర్ట్స్ జాన్స్టన్(ఫిలీప్పీన్స్)ను పడగొట్టి నాలుగు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత నిమిషంన్నరలోనే మరో పాయింట్‌తో 5-0తో సునీల్ గెలుపొందాడు.
🤼♂️SUNIL KUMAR OPENED THE WRESTLING ACCOUNT
Former Asian Champion Sunil Kumar defeated Callum Johnston Roberts🇵🇭 via Technical Superiority 9-0 to win BRONZE🥉 in Men’s Greco-Roman 87 kg category at the Asian Games.
This is the 2nd Asian Games medal for Sunil. pic.twitter.com/JB3u6YLfcS
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) September 30, 2026
గత ఎడిషన్‌లో హంగ్జౌలోనూ అతడు మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా ఆసియా క్రీడల గ్రీకో రోమన్ పోటీల్లో పతకాలు సాధించిన భారత తొలి రెజ్లర్‌గా సునీల్ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం భారత్ ఖాతాలో 60 పతకాలు చేరాయి. వీటిలో 10 స్వర్ణాలు, 21 రజతాలు, 29 కాంస్యాలు ఉన్నాయి.