రుద్రంపూర్, సెప్టెంబర్ 30 : కామ్రేడ్ వట్టికొండ రజినీకుమారి నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని సీపీఐ గౌతమ్పూర్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం గౌతమ్పూర్లోని ఆమె స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. రజినీకుమారి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కామ్రేడ్ వట్టికొండ రజినీకుమారి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాల కోసం ఆమె చేసిన కృషి, పేదల సమస్యలపై ఆమె చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. రజినీకుమారి మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరై రజినీకుమారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం నూతికుర్తి నవీన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గౌతమ్పూర్ సర్పంచ్ సపవట్ కళ్యాణి, రుద్రంపూర్ ఉప సర్పంచ్ తోట రాజు, గౌతమ్పూర్ ఉప సర్పంచ్ గంగారాం, వట్టికొండ చైతన్య, హుమాయూన్, కత్తెర్ల రాములు, బండారి మల్లయ్య, సూర్యనారాయణ, బొక్క వెంకటేశ్వర్లు, చలం వెంకటరమణ, లక్ష్మి, భాగ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బావు సతీష్, మునవర్, ఎన్.డి.రవితేజ, మాచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.