ఓటమితో ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’!
మధ్యంతర ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు జ్ఞానోదయం కలిగింది. తన వలసవాద విధానం ‘మరీ కఠినంగా’ ఉందని ఆయన ఒప్పుకున్నారు. రానున్న సంవత్సరాల్లో డెమోక్రటిక్ పార్టీతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ వెల్లడించారు. నవంబర్ 3న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిపైనా పట్టు సాధించారు. ఈ క్రమంలో రిపబ్లికన్ల అధీనంలో ఉన్న అనేక స్థానాలను కైవసం చేసుకుని ట్రంప్‌ను భారీగా దెబ్బతీశారు.
- ఇరాన్‌తో యుద్ధం ఉండక పోవచ్చు
- తమ వలస విధానం ‘మరీ కఠినంగా’ ఉందని వ్యాఖ్య
వాషింగ్టన్, నవంబర్ 9: మధ్యంతర ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు జ్ఞానోదయం కలిగింది. తన వలసవాద విధానం ‘మరీ కఠినంగా’ ఉందని ఆయన ఒప్పుకున్నారు. రానున్న సంవత్సరాల్లో డెమోక్రటిక్ పార్టీతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ వెల్లడించారు. నవంబర్ 3న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిపైనా పట్టు సాధించారు. ఈ క్రమంలో రిపబ్లికన్ల అధీనంలో ఉన్న అనేక స్థానాలను కైవసం చేసుకుని ట్రంప్‌ను భారీగా దెబ్బతీశారు.
సీబీఎస్ సంస్థకు చెందిన 60 మినిట్స్ కార్యక్రమంలో తన పరిపాలన చేపట్టిన బహిష్కరణ(డిపోర్టేషన్) విధానంపై అడిగిన ప్రశ్నకు ట్రంప్ జవాబిస్తూ ఇది మరీ కఠినంగా ఉండి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. తాను చేపట్టిన కఠినమైన వలస విధానాలు ఎన్నికల్లో తనకు ప్రయోజనాన్ని, నష్టాన్ని రెండింటినీ కలిగించాయని ఆయన పేర్కొన్నారు. సరిహద్దులను మూసివేసినందుకు తనకు ఏ+గ్రేడ్ లభించిందని, అలాగే నేరస్థులను దేశం నుంచి బయటకు పంపినందుకు మంచి గుర్తింపు వచ్చిందని ట్రంప్ చెప్పారు. అయితే మంచి ఉద్యోగాలు కలిగి ఉండి, కేవలం చట్టాన్ని ఉల్లంఘించి..అంటే దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం ద్వారా తప్పుచేసిన వారిని కూడా పంపేయడం వల్ల తనకు నష్టం జరిగింది అని ఆయన అన్నారు. ఇరాన్ విషయంలో కొత్తగా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం లేదని, దీంతో యుద్ధం ఉండకపోవచ్చు అన్నట్టు ట్రంప్ సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

