డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతుంది. దీని వలన ప్రజలకు చాలా మంచే జరుగుతున్నప్పటికీ, కొందరు దుర్వినియోగం చేస్తూ పలు తప్పులకు పాల్పడుతున్నారు. తప్పడు ప్రచారాలు చేస్తూ అందరిని అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా మిస్టర్ బీన్ అలియాస్ రోవాన్ ఎట్కిన్సన్ చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఫేక్ ఫేస్ బుక్ పేజ్‌లో మే 29న నటుడు రోవాన్ ఎట్కిన్సన్ చనిపోయాడని పోస్ట్ పెట్టారు. ఇది నిజమని తెలుసుకొని చాలా మంది షేర్ చేశారు.
కాని అది తప్పుడు వార్త అని తెలియడంతో నెటిజన్స్ బోగస్ పేజ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పేజీ నుంచి పోస్ట్ డిలీట్ చేశారు. మిస్టర్ బీన్ క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, 66 ఏళ్ల రోవాన్ చనిపోయాడంటూ 2012, 2013, 2015, 2016, 2017, 2018 సంవత్సరాలలో కూడా తప్పుడు ప్రచారం జరిగింది. 90ల కాలంలో మిస్టర్ బీన్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్న రోవాన్ మరిన్ని కాలాలు బతకాలని తన కామెడీతో ఎప్పుడు అలరిస్తూ ఉండాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. మిస్టర్ బీన్ కార్యక్రమంతో చాలా ఫేమస్ అయిన రోవాన్ ..స్లాప్స్టిక్ కామెడీ, మైమ్తోనే నవ్వులు పంచుతాడన్న విషయం అందరికి తెలిసిందే.