టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న చిత్రం ఖిలాడీ. రాక్షసుడు ఫేం రమేశ్ వర్మ (Ramesh Varma) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు నుంచి అదిరిపోయే అప్ డేట్ అందించారు మేకర్స్. రవితేజ సినిమా అంటే వినోదంతోపాటు మాస్, రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయని తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టైటిల్ ట్రాక్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. తాజాగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మరో క్రేజీ సాంగ్ షూటింగ్ రేపటి నుంచి షురూ కానుంది. రవితేజ, డింపుల్, మీనాక్షిలపై ఈ పాట ఉండనుందట. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ క్రేజీ పాటకు నృత్యరీతులు అందించనున్నాడు. సెప్టెంబర్‌లోనే ఖిలాడీ టాకీ పార్టు పూర్తయింది.
ఫిబ్రవరి 11న 2022న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఖిలాడీ చిత్రంలో డింపుల్ హయతి (Dimple Hayathi), బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ, ఏ స్టూడియోస్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మరోవైపు రవితేజ యువ దర్శకుడు శరత్ మండవతో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో పాత్రలో కనిపించబోతున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
MP Santosh kumar | ‘బిగ్ బాస్ 5 ‘ చీఫ్ గెస్ట్ గా ఎంపీ సంతోష్‌కుమార్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్‌లు బాగానే ఉన్నాయిగా..!
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్