టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న రమేశ్ వర్మ (Ramesh Varma) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రవితేజ అభిమానులకు రమేశ్ వర్మ అండ్ టీం స్పెషల్ ప్రోమోను విడుదల చేసింది. సెప్టెంబర్ 10న ఖిలాడీ ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతుందని ప్రోమో ద్వారా తెలిపారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ (DSP) కంపోజ్ చేసిన రొమాంటిక్ టచ్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రోమోతో తెలిసిపోతుంది.
వన్ ఆఫ్ ది లీడింగ్ లేడీ, హాట్ బ్యూటీ డింపుల్ హయతి (Dimple Hayathi) శారీ లుక్ లో రొమాంటిక్ గా కనిపిస్తూ..ప్రేక్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్క ప్రోమోలో ఇలా ఉంటే ఇక ఫుల్ సాంగ్ లో అందాల ఆరబోత మామూలుగా ఉండదేమోనని తాజా రషెస్ ద్వారా తెలిసిపోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మీనాక్షి చౌదరి మరో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్ కు అద్బుమైన స్పందన వచ్చింది. క్రాక్ హిట్ తో ఫుల్ జోష్ మీదున్న రవితేజ మరోసారి తన ఫ్యాన్స్ కు , మూవీ లవర్స్ బిగ్గె స్ట్ హిట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.
Mass Maharaja @RaviTeja_offl & @DirRameshVarma 's #Khiladi music fest date fixed.
— BA Raju's Team (@baraju_SuperHit) August 22, 2021
First single releasing on Sep 10th. 🔥
A Rockstar @ThisIsDSP musical 🎶 @DimpleHayathi @_meenakshii1 @sagar_singer @idhavish @PenMovies#HBDRameshVarma pic.twitter.com/kDro8MkuLE
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!