Thiruveer | జార్జిరెడ్డి, పలాస 1978 సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్ (Thiruveer). ‘మసూద’ సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు తిరువీర్.
లీడ్ యాక్టర్‌గా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని సాగిస్తున్న ఈ తిరువీర్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.
రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపించబోతున్నాడు తిరువీర్. ఫొటోగ్రాఫర్ పాత్రలో నటించడం ఆసక్తికర విషయం. నేను పలు సార్లు నా ఫోన్‌తో ఫొటోలు తీసేవాడిని. కానీ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా నటిస్తుండటం కొంచెం సవాల్‌తో కూడుకున్నది. కెమెరాను ఎలా హ్యాండిల్ చేయాలి.. డిఫరెంట్ బాడీ యాంగిల్స్, కదలికలను ఎలా కెమెరాలో బంధించాలో నేర్చుకోవాల్సి వచ్చిందన్నాడు తిరువీర్.
కాగా మసూద సక్సెస్ తర్వాత ఆచితూచి కథలను ఎంచుకున్నట్టు.. అదృష్టవశాత్తు దర్శకనిర్మాతలు నా పర్సనాలిటీకి సూట్ అయ్యే పాత్రలతో వస్తున్నారు. నా పాత్రల్లో జీవించేందుకు థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు తిరువీర్. ఈ క్రేజీ యాక్టర్ మరోవైపు భగవంతుడు సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టేనని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
Team #TheGreatPreWeddingShow wishes everyone A sparkling & safe Diwali 🪔❤️🔥
Shoot Begins Soon.. 📸#HappyDiwali 🧨🔥 pic.twitter.com/U4PQA5FLOa
— Puppet Show Productions (@PuppetShowProd) October 31, 2024
Read Also :
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్