Prudhvi Raj | టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ కమెడియన్ పృథ్వీ రాజ్ (Prudhvi Raj) అస్వస్థతకు గురయ్యారు. హైబీపీకి గురికావడంతో కుటుంబ సభ్యులు పృథ్వీ రాజ్‌ను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది.
సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి హై బీపీ రావడంతో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు.. ‘లైలా’ సినిమా ఈవెంట్ సమయంలో వైసీపీకి పరోక్షంగా కౌంటర్ వేసి వార్తల్లో నిలిచిన పృథ్వీ..#PrudhviRaj #Laila #LailaTrailer #VishwakSen pic.twitter.com/xcT3g5HZkj
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) February 11, 2025
కాగా, ‘లైలా’ సినిమా ఈవెంట్ సమయంలో వైసీపీకి పరోక్షంగా కౌంటర్ వేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం లైలా (Laila). రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించారు.
ఈ ఈవెంట్లో భాగంగా లైలా సినిమాలోని ఓ సన్నివేశం గురించి థర్ట్ ఇయర్స్ పృథ్వీ (Prudhvi raj) మాట్లాడుతూ.. లైలాలో తాను మేకల సత్తిగా చేశానని .. అయితే మేకలు ఎన్ని ఉన్నాయని షాట్ మధ్యలో అడిగితే 150 ఉన్నాయన్నాను. షాకింగ్ ఎంటో కానీ సినిమా చివరిలో లెక్కేస్తే మొత్తం 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టారంటూ కామెంట్లు చేశాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సీట్లను, ఇప్పుడున్న సీట్లనుద్దేశించి ఈ కామెంట్స్ చేశాడంటూ బాయ్‌కాట్ ట్రెండ్ షురూ చేశారు.
Also Read..
Vishwak Sen | ఎవరి తప్పుకో మేమెందుకు బలి కావాలి? ఆ మాటలతో మాకెలాంటి సంబంధం లేదు: విశ్వక్సేన్
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Vishwak Sen | ‘లైలా’ సినిమాను చంపేయకండి.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై విశ్వక్ సేన్ ప్రెస్ మీట్
Boycott Laila | విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమాకు బాయ్‌కాట్ ట్రెండ్.. కారణం ఇదే.!