Laila Movie | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లైలా చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఒక వర్గానికి కోపం తెప్పించడంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించి బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తుంది. అయితే ఈ విషయం మరింత ముదరడంతో తాజాగా వివాదంపై నటుడు విశ్వక్సేన్ క్షమాపణలు తెలిపాడు.
విశ్వక్ మాట్లాడుతూ.. లైలా సినిమాను విడుదలయిన రోజే HD ప్రింట్ సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారు. 25000 ట్విట్లు వేశారు బాయ్‌కాట్ లైలా అంటూ.. కామెంట్లు పెట్టారు. సినిమా వాళ్లు ఈజీగా టార్గెట్ అవుతామా అనిపిస్తుంది ఇవి చూస్తుంటే. పృథ్వి చేసిన కామెంట్స్‌కు సినిమా యూనిట్‌కు సంబంధం లేదు. స్టేజ్ పై పృథ్వి మాట్లాడేటప్పుడు నేను నిర్మాత లేము. మేమిద్దరం చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాము. పృథ్వి మీద కోపం నా సినిమాపై చూపిస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి. ఇలా చేసి సినిమాను చంపేయకండి. నాతో శత్రుత్వం లేనప్పుడు నా సినిమాను ఎందుకు టార్గెట్ చేస్తారు. నేను అన్నప్పుడు అలా చేయండి. ఈ వివాదం గురించి ఇంకా మాట్లాడాలి అనుకోవట్లేదు. మేము లేనప్పుడు జరిగిన తప్పుకి మమ్మల్ని బలి చేయకండంటూ విశ్వక్ చెప్పుకోచ్చాడు.
అసలు ఏం జరిగిందంటే.. లైలా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. ఇందులో నేను మేకల సత్తిగా చేశానని తెలిపారు. అయితే మేకలు ఎన్ని ఉన్నాయని షాట్ మధ్యలో అడిగితే 150 ఉన్నాయని తెలిపాను. అయితే షాకింగ్ ఎంటో కానీ సినిమా చివరిలో లెక్కేస్తే మొత్తం 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టారంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్లు వైసీపీని ఉద్దేశించే చేశాడంటూ వైసీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో 151 సీట్లు గెలిచిన వైసీపీ గత ఎన్నికలలో 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. దీంతో పృథ్వీ వైసీపీ గురించే కామెంట్లు చేశాడని లైలా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్‌ని స్టార్ట్ చేశారు.
Please Support #Laila, asks Vishwak Sen. pic.twitter.com/U3l1vWSV5i
— Aakashavaani (@TheAakashavaani) February 10, 2025