తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న లెజెండరీ యాక్టర్లలో ఒకరు అక్కినేని నాగేశ్వర్రావు (ANR). ఏఎన్ఆర్గా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు ఆయన. ఇవాళ అక్కినేని నాగేశ్వర్రావు 99వ జయంతి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (ANR) తాను ఎంతగానో అభిమానించే హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఎన్ఆర్, చిరంజీవి కలిసి మెకానిక్ అల్లుడు సినిమాలో నటించారు.
ఈ సినిమాలో చిరు, ఏఎన్ఆర్ పోషించిన పాత్రలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. ఇక ఆ సినిమా షూటింగ్ టైంలో ఏఎన్ఆర్ను ఎత్తుకున్న త్రోబ్యాక్ స్టిల్‌ను షేర్ చేసుకుంటూ..మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి 99 వ జన్మదినోత్సవం సందర్భంగా నా ఆత్మీయ స్మృత్యంజలి..అని ట్వీట్ చేశాడు చిరంజీవి. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి 99 వ జన్మదినోత్సవం సందర్భంగా
నా ఆత్మీయ స్మృత్యంజలి ! #ANRLivesOn @iamnagarjuna pic.twitter.com/ovysqJV1jJ— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022