Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్గా చిరంజీవి (Chiranjeevi) తిరుగులేని విజయాన్ని అందుకుంటున్న తరుణంలో ఎన్నో అవార్డులు వరించాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీటిలో వజ్రోత్సవం అవార్డు కూడా ఒకటి. ఆ అవార్డును తీసి పక్కన పడేశానంటూ గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యాడు.
ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం-2024 (ANR National Award 2024) ను అందుకున్న సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచా. ఇంట గెలిచే అవకాశం సినీ వజ్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు రావడం కొందరికి నచ్చలేదు. లెజెండరీ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు. అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీ నన్ను వజ్రోత్సవం అవార్డుతో సత్కరించాలనుకున్నప్పుడు కొంతమంది విమర్శించడంతో బాధపడి అవార్డు తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది.
అవార్డును క్యా్ప్సుల్స్ బాక్సులో వేశా. అవార్డును అందుకునేందుకు అర్హత వచ్చినప్పుడే అందుకుంటానని ఫిక్సయ్యా. అయితే ఇప్పుడు నా స్నేహితుడు నాగార్జున వచ్చి ఈ పురస్కారాన్ని అందుకునేందుకు మీరు అర్హులు అన్నప్పుడు నేను ఇంట కూడా గెలిచాననిపించింది. పద్మ విభూషణ్. పద్మ భూషణ్తోపాటు ఎన్నో పెద్ద పురస్కారాలొచ్చినా ఇదే ప్రత్యేకమంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి.
ANR National Award 2024 | ఏఎన్నార్ జాతీయ పురస్కారం అందుకున్న చిరంజీవి
ANR National Award 2024 | ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఈవెంట్లో తారల సందడి
Matka | వరుణ్ తేజ్ మట్కాలో పుష్ప యాక్టర్.. ట్రెండింగ్లో లుక్