Thandel | టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి తండేల్ (Thandel). అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రస్తుతం చైతూ, సాయిపల్లవి టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. కాగా మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో తండేల్ ఫస్ట్ కాపీ రెడీ అయింది. స్టూడియోలో ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చందూమొండేటి, దేవీ శ్రీ ప్రసాద్ తండేల్లోని హైలెస్సో పాటకు స్టెప్పులేశారు. ఈ ఇద్దరూ హైలెస్సో పాటలో లీనమైపోయి డ్యాన్స్ చేసి.. విడుదలకు ముందే సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి అంటూ చెప్పేస్తున్నారు.
ఇప్పటికే హైలెస్సో హైలెస్సా పాటకు సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్ కాలేజ్ విద్యార్థినితో కలిసి డ్యాన్స్ చేయగా.. హుక్ స్టెప్ వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీమణి రాసిన ఈ పాటను దేవిశ్రీప్రసాద్ కంపోజిషన్‌లో శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ పాడారు.
#Thandel From Tomorrow ! As The Celebrations Already Began From Music @ThisIsDSP & Director #ChandooMondeti After Watching The First Copy !! pic.twitter.com/L3O5LmxSDr
— BA Raju’s Team (@baraju_SuperHit) February 6, 2025
నెట్టింటిని షేక్ చేస్తున్న పాట..
ఎంతెంత దూరాన్ని నువ్వూ నేనూ మోస్తూ ఉన్నా అసలింత అలుపే రాదు..ఎన్నెన్ని తీరాలు నీకూ నాకు మధ్యన ఉన్నా కాస్తయినా అడ్డే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం..నీవు లేకుండా ఎంత అన్యాయం గడియారంలో సెకనుల ముల్లే గంటకు కదిలిందే.. నీతో ఉంటే కరిగే కాలం..నువు లేకుంటే కదలదు కాలం అని నెలలో ఉండే తేదీ కూడా డాదయ్యిందే..హైలెస్సో అంటూ హీరోహీరోయిన్ల మధ్య సాగుతున్న ఈ పాట నెట్టింటిని షేక్ చేస్తూ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న తండేల్ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Samuthirakani | ‘ఒక పథకం ప్రకారం’ పట్టుకుంటే రూ.10 వేలు.. సముద్రఖని బంపర్ ఆఫర్
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్