బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన నటి దివి. తాజాగా ఈ అమ్మడు క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది. ఇందులో గిరిధర్, ధన్రాజ్, ప్రవీణ్,శ్రీహాన్, సిరి కీలక పాత్రలు పోషించారు. కొత్త కాన్సెప్ట్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందించబడిన ఈ చిత్రాన్ని ‘గాలి సంపత్’ సినిమాతో నిర్మాతగా మారిన ఎస్ కృష్ణ నిర్మించారు. కెవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. కరోనా వలన థియేటర్లు మూతపడడంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.
యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు.. వర్మ, స్వప్పలతో కలిసి స్పార్క్ ఓటీటీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇందులో తొలుత వర్మ తెరకెక్కించిన డి చిత్రం విడుదలైంది. ఇక ఇప్పుడు దివి నటించిన క్యాబ్ స్టోరీస్ అనే చిత్రం మే 28న డిజిటల్ ప్రీమియర్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ‘క్యాబ్ స్టోరీస్’ చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.