మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో పదోసారి పెంపు..
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో పదోసారి పెంపు.. | చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చారు. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి.

న్యూఢిల్లీ : చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. ఒక రోజు విరామం అనంతరం ధరలు పైకి కదిలాయి. గత కొద్ది రోజులుగా కంపెనీలు రోజు విడిచి రోజు పెంచుతూ వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్ డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.58, డీజిల్ రూ.83.51కు చేరింది. మరో వైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వందకు చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్ రూ.99.14, డీజిల్, రూ.90.71కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.92.92, డీజిల్ రూ.86.35, చెన్నైలో పెట్రోల్ రూ.94.54, డీజిల్ రూ.88.34, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.50, డీజిల్ రూ.91.04, జైపూర్‌లో పెట్రోల్ రూ.99.30, డీజిల్ రూ.92.18, బెంగళూరులో పెట్రోల్ రూ.95.94, డీజిల్ రూ.88.53కి చేరాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో అత్యధికంగా రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.80, డీజిల్ రూ.96.30 చేరింది. ఈ నెలలో ఇప్పటి వరకు చమురు కంపెనీలు పదిసార్లు ధరలను పెంచాయి. ఓ వైపు కరోనా మహమ్మారి సమయంలో ఇంధన ధరలు గత కొద్ది రోజులుగా పైపైకి వెళ్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
18-05-2021 మంగళవారం.. మీ రాశి ఫలాలు
టీకాతో సమస్యలు నామమాత్రం
నేడు పలు రాష్ట్రాల అధికారులతో ప్రధాని భేటీ
ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకా డోసులు : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కొవిడ్ ప్రోటోకాల్ నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

