IPL | హైదరాబాద్, ఆట ప్రతినిధి: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో కీలక పోరుకు సిద్ధమైంది. తమ డాషింగ్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న హైదరాబాద్.. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తలపడనుంది. లీగ్‌లో రికార్డు స్కోర్లతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. సొంత ఇలాఖాలో ఆర్సీబీని మరోమారు అరుసుకోవాలని చూస్తున్నది. ట్రావిస్ హెడ్, అభిషేక్‌శర్మ, క్లాసెన్ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు ఆర్సీబీ వరుస ఓటములతో కునారిల్లుతున్నది.