టీఎంయూ గుర్తు ఎలా మార్చుతారు?
తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు చెందిన బాణం గుర్తును ఇతరులకు ఎలా కట్టబెడుతారంటూ కార్మికలోకం గర్జించింది. టీఎంయూకు చెందిన గుర్తును తిరిగి కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లేబర్ కమిషనర్ ఆఫీసును సోమవారం టీఎంయూ, ఈయూ, ఎన్ఎంయూ యూనియన్లకు చెందిన వేలాదిమంది కార్మికులు ముట్టడించారు.
- లేబర్ కమిషన్ ప్రభుత్వానికి తొత్తుగా మారిందని ఆగ్రహం
- బాణం గుర్తు టీఎంయూకే ఇవ్వాలి
- ‘చలో లేబర్’ ఆఫీసు ముట్టడిలో టీఎంయూ, ఈయూ, ఎన్ఎంయూ
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు చెందిన బాణం గుర్తును ఇతరులకు ఎలా కట్టబెడుతారంటూ కార్మికలోకం గర్జించింది. టీఎంయూకు చెందిన గుర్తును తిరిగి కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లేబర్ కమిషనర్ ఆఫీసును సోమవారం టీఎంయూ, ఈయూ, ఎన్ఎంయూ యూనియన్లకు చెందిన వేలాదిమంది కార్మికులు ముట్టడించారు. తమకు ఎంతోకాలంగా ఉన్న విల్లు-బాణం ఎన్నికల గుర్తును వేరే వర్గానికి కేటాయించడం పట్ల టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం థామస్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనకి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
హక్కులను సాధించుకునే విషయంలో కార్మికవర్గం అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను కాంగ్రెస్ కాలరాస్తున్నదని థామస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలకు అనుగుణంగా కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం కార్మికశాఖపై ఉన్నదని అన్నారు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వానికి ఎలా వత్తాసు పలుకుతారని నిలదీశారు. చట్టాలను కాలరాసిన ప్రొసీడింగ్ ఆఫీసర్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. టీఎంయూను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే గుర్తును కాంగ్రెస్ దొంగిలించిందని ఆరోపించారు. ఈయూ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. టీఎంయూ గుర్తును తిరిగి ఆ సంఘానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. గుర్తుల కేటాయింపు అంశంపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), ఎన్ఎంయూ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

