రెజ్లర్ సుశీల్‌కుమార్‌పై రూ.లక్ష రివార్డు ప్రకటించిన ఢిల్లీ పోలీసులు
రెజ్లర్ సుశీల్‌కుమార్‌పై రూ.లక్ష రివార్డు ప్రకటించిన ఢిల్లీ పోలీసులు | సీనియర్ రెజ్లర్ సుశీల్‌కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ రెజ్లర్ మృతి కేసులో తప్పించుకొని తిరుగుతుండగా.. సుశీల్ ఆచూకీ చెబితే రూ.లక్ష, అతని అనుచరుడి గురించి సమచారం ఇస్తే రూ.50వేల రివార్డ్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

న్యూఢిల్లీ : సీనియర్ రెజ్లర్ సుశీల్‌కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ రెజ్లర్ మృతి కేసులో తప్పించుకొని తిరుగుతుండగా.. సుశీల్ ఆచూకీ చెబితే రూ.లక్ష, అతని అనుచరుడి గురించి సమచారం ఇస్తే రూ.50వేల రివార్డ్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న దేశ రాజధాని ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో ఘర్షణ చోటు చేసుకోగా.. సాగర్ దండక్ అనే రెజ్లర్ మృతి చెందిన విషయం తెలిసిందే. సుశీల్ కుమార్, అతని అనుచరులు దాడి చేయడంతోనే తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు ఆధారాలు సేకరించి, కేసులు నమోదు చేశారు.
ప్రత్యక్ష సాక్షులు, గాయపడిన ఇతర రెజ్లర్లను విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు. హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో సుశీల్ స్వయంగా దాడి చేసినట్లు ఒక వీడియోలో స్పష్టంగా ఆధారాలు దొరికాయి. దీంతో పోలీసులు సుశీల్‌పై హత్య కేసు నమోదు చేసి, అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఘటన చోటు చేసుకున్న నాటి నుంచి సుశీల్ కుమార్ పోలీసులకు కనిపించకుండా తప్పించుకున్నాడు. అతడితో పాటు అతని స్నేహితులపై పోలీసులు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అతడి కోసం 20 బృందాలుగా విడిపోయిన 50 మంది ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. సుశీల్‌తో పాటు మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేయగా.. వారెంట్ జారీ చేస్తూ ఢిల్లీ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, పక్షం రోజులుగా కనిపించకుండా పోయిన సుశీల్ కుమార్ అసలు ఎక్కడ తలదాచుకున్నాడనేది తెలియడం లేదు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో పలు చోట్ల గాలింపులు చేపట్టారు. అయినా, ఎలాంటి ప్రయోజం లేకపోయింది. ఈ క్రమంలో చివరి అస్త్రంగా ఢిల్లీ పోలీసులు ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ఇదే కేసులో అతని అనుచరుడు అజయ్ అనే వ్యక్తి సమాచారం ఇస్తే రూ.50వేల రివార్డు ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో వైపు ఇవాళ ఢిల్లీ రోహిణి కోర్టులో సుశీల్‌కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.
ఇవి కూడా చదవండి..
18-05-2021 మంగళవారం.. మీ రాశి ఫలాలు
టీకాతో సమస్యలు నామమాత్రం
నేడు పలు రాష్ట్రాల అధికారులతో ప్రధాని భేటీ
ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకా డోసులు : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కొవిడ్ ప్రోటోకాల్ నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో పదోసారి పెంపు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

