BVS Ravi | టాలీవుడ్ రైటర్ బీవీఎస్ రవి ప్రస్తుతం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇటీవలే ఫస్ట్ ఎపిసోడ్ ఆహాలో ప్రీమియర్ కాగా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు బీవీఎస్ రవి (BVS Ravi). ఈ సందర్భంగా ఆసక్తికర విషయమొకటి చెప్పి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చిరంజీవి, రవితేజతో ఉండబోతుందని చెప్పాడు. చిరంజీవి (Chiranjeevi) సినిమా గురించి మాట్లాడుతూ.. బలమైన సామాజిక సందేశంతో ఉంటుందన్నాడు.
చిరంజీవి కమర్షియల్ హిట్స్‌ను ఇప్పటికే ప్రేక్షకులు చూశారు. ఈ సారి మాత్రం చిరంజీవిని మరింత సామాజిక దృక్పథం ఉన్న పాత్రలో చూపించే సమయం వచ్చిందన్నాడు. త్వరలోనే మరిన్ని వివరాలపై స్పష్టత అవకాశాలున్నాయని ఫిలిం నగర్ సర్కిల్ టాక్. మరి ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ, స్క్రీన్ ప్లేపైనే ఫోకస్ పెడతాడా..? లేదంటే డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తాడా.. అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో చిరంజీవి నుంచి కానీ, బీవీఎస్ కాంపౌండ్ నుంచి కానీ స్పష్టత వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న విశ్వంభరలో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బీవీఎస్ రవి మరోవైపు రవితేజతో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడని చెప్పడంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి