ట్రెండ్ మారింది…అనే కంటే దక్షిణాది సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయి అంటే సరిగ్గా సరిపోతుంది. ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలు (South films) బాక్సాపీస్ వద్ద సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. బాహుబలి నుంచి కేజీఎఫ్ 2 వరకు ఇపుడు ఎక్కడ చూసినా దక్షిణాది సినిమాల జపం చేస్తున్నారు సినీ సెల్రబిటీలు. బాలీవుడ్ సినీ పరిశ్రమే (Bollywood Industry) అన్నింటికి బాప్ అనే స్థాయి నుంచి కంటెంట్ ఉన్న సౌత్ సినిమాలే ఇపుడు టాప్ అనే స్థాయికి పరిస్థితులు వచ్చేశాయి.
ఒకప్పుడు ప్రాంతీయ సినిమాలంటే లెక్కచేయని హిందీ యాక్టర్లు (Bollywood Actors) సైతం ఇపుడు సౌత్ సినిమాలను ఆకానికెత్తేస్తున్నారు. ఇటీవలే అనిల్ కపూర్ దక్షిణాది సినిమాలను ప్రమోట్ చేస్తూ ఏదో ఒక కామెంట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప బీటౌన్ బాక్సాపీస్ వద్ద చేస్తున్న వసూళ్లు బాలీవుడ్‌ను షేక్ చేశాయని ఇప్పటికే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్వీట్ల వర్షం కురిపించాడు. దక్షిణాది చిత్రాలతో తాను కెరీర్‌ని ప్రారంభించానని..సౌతిండియా సినిమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని..వారి నుంచి బాలీవుడ్ ఎంత ఇన్ ఫుట్స్ (నేర్చుకుంటే)తీసుకుంటే..హిందీ సినీ పరిశ్రమకు అంత మంచిదని ఇప్పటికే అనిల్ కపూర్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
తాజాగా టాలెంటెడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి ( Manoj Bajpayee) దీనిపై స్పందించాడు. దక్షిణాది సినిమాల ప్రభావంతో ముంబై చిత్ర పరిశ్రమకు చెందిన మెయిన్ స్ట్రీమ్ సినీ నిర్మాతలందరి వెన్నులో వణుకు పుట్టించింది. వారికి ఇపుడు సరైన సినిమా ఎక్కడ వెతకాలో తెలియడం లేదు. మెయిన్ స్ట్రీమ్ సినిమాను ఎలా తీయాలో నేర్చుకునేందుకు ముంబై ఇండస్ట్రీ ప్రధాన స్రవంతి దర్శకనిర్మాతలకు ఇదొక పాఠం లాంటిదని అన్నాడు. ఇపుడు సౌత్ సినిమాలంటే బాలీవుడ్ మేకర్స్ భయపడుతున్నారని చెప్పుకొచ్చాడు మనోజ్ బాజ్‌పేయి.
మనోజ్ బాజ్‌పేయి గతేడాది జీ5లో Dial 100, అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలుకరించాడు. ప్రస్తుతం డిస్పాచ్, గుల్మోహర్ సినిమాలతోపాటు ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ లో నటిస్తున్నాడు.
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Also : Nandamuri Balakrishna | ఆస్పత్రిలో బాలకృష్ణ..పుకార్లపై పీఆర్ టీం క్లారిటీ
Read Also : Kiara Advani post | బ్రేకప్ వార్తల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా కియారా తాజా పోస్ట్